Friday, 10 August 2012


కా||సూర్యంజీవితచరిత్ర రచనలకుఆహ్వానం
అమరుడు కా|| సూర్యం (చింతల వెంకట స్వామి) సంస్మరణ సభను ప్రతి సంవత్సరం ఆయన అమరుడయిన సెప్టెంబరు 29వ తేదీన జరపాలనీ, అలాగే ఆయన అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఒక స్మారకోపన్యాసాన్ని ఇప్పించాలని నిర్ణయించాము.


   "నా చావు దోపిడీవర్గాల గూండాల కత్తిపోట్లతో రావొచ్చు, పోలీసు తుపాకీ గుండ్లతో కావొచ్చు, రోడ్డు మీదనో, పోలాల్లోనో, కోండల్లోనో, అడవుల్లోనో, మైదానాల్లోనో ఎక్కడైనా కావొచ్చు, ఏవిధంగానైనా రావొచ్చు, నా శవాన్ని నా భార్యాబిడ్డలు చూసే అవకాశం వుండకపోవచ్చు. ఉన్నా పోలీసులు, ప్రభుత్వం చూడనీయక పోవచ్చు. అది ఎలా జరిగినా, ఎప్పుడు జరిగినా, నా మరణం పీడిత ప్రజల కోసమే. నా చావు కష్టజీవులైన కార్మిక, కర్షకుల పక్షమే. కాబట్టే బ్రతికుండగా బాధల గురించిగానీ, చావు గురించిగనీ చింతించే సమస్యే లేదు. ప్రతి మనిషికీ చావు సహజమైన పరిణామ క్రమం. జన్మించిన ప్రతి మనిషి మరణించక తప్పదు. జననానికీ, మరణానికీ మధ్య ఏ ఆశయం కోసం పాటుపడ్డానో, ఏ వర్గం కోసం జీవించానో అనేదే నా ప్రశ్న. మనిషి మహొన్నతమైన అద్భుతాలను సాధిస్తాడు అనేది నా నమ్మకం. ఆ విశ్వాసంతోనే పీడిత ప్రజల కోసం భారత కమ్యూనిస్టుపార్టీ (మార్కిస్టు - లెనినిస్టు)పీపుల్స్ వార్ పార్టీలో పనిచేస్తున్నాను. దోపిడీ వర్గాల ప్రభుత్వం అనుసరిస్తున్న దోపిడీ విధానాలను, దుర్మార్గాన్ని ధ్వంసం చేసి నూతన సమాజావిర్భావానికి అచంచల్ ఆత్మవిశ్వాసంతో, ఎంతో మంది ఉత్తమ పుత్రుల త్యాగాలతో, రక్తతర్పణంతో, సడలని దీక్షతో నా పీపుల్స్ వార్ పార్టీ పనిచేస్తుంది. తల్లి గర్భాన్ని చీల్చుకొని నూతన శిశువు జన్మిస్తున్నప్పుడు మెలికలు తిరిగే నొప్పులు, కళ్ళు బైర్లు కమ్మి రక్తస్రావం ఎలా తప్పదో అలాగే పాత సమాజం స్థానంలో నూతన సమాజ ఆవిర్భావానికి ముందు విరుద్ధ శక్తుల సంఘర్షణలో కష్టాలు, కడగండ్లు, రక్తతర్పణం తప్పదు. నా త్యాగం వృధా కాదు." అనే విశ్వాసంతో విప్లవకారునిగా జీవించి ది. 29-9-1994న అమరుడయిన కా|| సూర్యం బయటి జీవితంకన్న ఉద్యమ జీవితమే సుదీర్ఘమైంది. సమాజాన్ని పాఠశాలగా, ఉద్యమాన్ని గురువుగా చేసుకొని ఆయన తన చైతన్యాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. ఉద్యమ ఆచరణను పదును పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కా|| సూర్యం రష్ట్రమంతటా అనేక స్థాయిలలో విలక్షణమైన బాధ్యతలను నిర్వర్తించాడు. తన క్రమ శిక్షణతో, పోరాట పటిమతో, స్నేహశీలతతో ఆయన ఎందరో Comradesను ప్రభావితం చేశారు. వారందరినీ భాగస్వాముల్ని చేసి ఉద్యమ విస్తృతికి ఎనలేని కృషి చేశాడుకా|| సూర్యం మిత్రులు, సహాచర Comrades జ్ఞాపకాలతో ఆయనజీవితాన్నిసమాజానికిఅక్షరరూపంలోఅందించాలనుకుంటున్నాము. కా||సూర్యంతో మీకున్న పరిచయాన్ని ఆయన వ్యక్తిత్వంపట్ల, నిబద్ధత పట్ల, ఆచరణపట్ల మీ అనుభవాలను వ్రాసి December- 2013 చివరిలోపు పంపవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయనకు సంబంధించిన ఫోటోలు, రచనలు కూడా పంపి కా|| సూర్యం జీవిత చరిత్ర రచనకు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
                                                                                                ఇట్లు
                                                                             కన్వీనర్ 
                                                         కామ్రేడ్ సూర్యం సంస్మరణ కమిటీ 
                                                                          గుంటూరు. 

రచనలు పంపవలసిన చిరునామాచింతల మల్లికార్జునరావుడోర్ నెం. 454,5th lane,bharath pet ,గుంటూరు - 522 004 (ఎ.పి.),
సెల్ : 92472 37361
E-mail : mallicadvocate@gmail.com



------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Photo Gallery






Video Gallery

Maoists support Telangana

1 comment: